: చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్!


మహిళ మెడలో బంగారు గొలుసు కొట్టేస్తూ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దొరికిపోయాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా గ్రామంలో ఈ రోజు జరిగింది. ఎలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల గ్రామానికి చెందిన బొరుసు మనోజ్ అనే యువకుడు హైదరాబాద్ లోని ఒక 'ఎంఎన్సీ'లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిస అయిన అతను అడ్డదోవలో సంపాదించాలనుకున్నాడు. దీంతో ఈరోజు సాయంత్రం బైక్ పై వెళుతూ కాజా గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక మహిళ మెడలో బంగారు గొలుసును తెంపాడు. అయితే, అది కిందపడటం, అదే సమయంలో అతని బైక్ ఆగిపోవడంతో దొంగ దొరికిపోయాడు. స్థానికులు మనోజ్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

  • Loading...

More Telugu News