: ఆయుధ సంపత్తి ఖర్చులో పది శాతంతో 15 ఏళ్ల పాటు ప్రపంచం ఆకలి తీర్చవచ్చట!


ప్రపంచ దేశాల్లో ఆయుధ సంపత్తి పెంచుకోవాలన్న తపన పెరిగిపోయిందని స్వీడన్ కు చెందిన అధ్యయన సంస్థ సిప్రి ఆవేదన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఆకలి కేకలు మిన్నంటిన తరుణంలో ఆయుధాలు పెంచుకునేందుకు ప్రపంచ దేశాలు కోట్ల డాలర్లను నీళ్లలా ఖర్చు చేస్తున్నాయని మండిపడింది. 2015లో ప్రపంచ దేశాలు ఆయుధాలు కొనుగోలు చేసిన మొత్తంలో కేవలం 10 శాతం ఖర్చు చేయగలిగితే, ప్రపంచంలోని ఆకలి బాధను 15 ఏళ్ల పాటు తీర్చవచ్చని సిప్రి తెలిపింది. గత సంవత్సరాలతో పోలిస్తే 2015లో ఆయుధ వ్యయం ఒక శాతం పెరిగిందని సిప్రి వెల్లడించింది. గతేడాది 1.7 ట్రిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారం జరిగిందని పేర్కొంది. భూమిమీద 800 మిలియన్ల మంది సరైన ఆహారం దొరకక అల్లాడిపోతున్నారని సిప్రి చెప్పింది. ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఖర్చు చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో అమెరికా ఉండగా, రెండో స్థానంలో చైనా ఉందని వెల్లడించింది. ఆసియా, మధ్య యూరోప్, మధ్య ప్రాచ్యదేశాలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని సిప్రి పేర్కొంది. అల్జీరియా, సౌదీ అరేబియా, వియత్నాం దేశాల సైనిక బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయని సిప్రి తెలిపింది. అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి పెట్టాలని సూచించింది.

  • Loading...

More Telugu News