: పదో తరగతి బాలికకు పన్నెండు మంది రెండు నెలల పాటు నరకం చూపించారు!
పదో తరగతి పరీక్షలకు సిద్ధమైన బాలికకు పన్నెండుమంది కామాంధులు నరకం చూపించిన ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా సరిహద్దుల్లోని అత్తింగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో దళిత మానసిక వికలాంగురాలు, వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కుటుంబంతో కలసి ఉంటోంది. ఆమెకు పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక పరీక్షలకు సిద్ధమవుతోంది. కుటుంబ పోషణ నిమిత్తం ఆమె చదువుకుంటూనే రికార్డింగ్ డ్యాన్సర్ గా పనిచేస్తోంది. గత ఫిబ్రవరి 2న తన మామయ్య స్నేహితులు అమీర్, అనూప్ షాలు ఆమెను ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. తరువాత రెండు నెలల పాటు 12 మంది లైంగిక దాడికి పాల్పడుతూ ఆమెకు ప్రతి రోజూ నరకం చూపించారు. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టారు.