: ప్లే స్టోర్ లో ఉగ్రవాదుల యాప్...తొలగించిన గూగుల్
ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు సోషల్ మీడియాను ఉగ్రవాద సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తాలిబాన్ న్యూస్ వెబ్ సైట్ పేరుతో ఓ యాప్ ను గూగుల్ స్టోర్ లో పెట్టింది. ఉగ్రవాదం, దూషణ, హింస గురించి ఆడియో, వీడియో రూపంలో ప్రచారం చేసేందుకు పాస్తో ఆఫ్ఘన్ న్యూస్-అలెమర పేరుతో ఈ యాప్ ను రూపొందించి, 2016 ఏప్రిల్ 1న గూగుల్ ప్లే స్టోర్ లోకి అప్ లోడ్ చేశారు. అయితే ఉగ్రవాదుల ఆన్ లైన్ వ్యవహారాలపై నిఘా పెట్టే ఓ సంస్థ దీనిని గుర్తించి, గూగుల్ దృష్టికి తీసుకురావడంతో అది అప్ లోడ్ అయిన రెండు రోజుల్లోనే ప్లే స్టోర్ నుంచి తొలగించారు. కొన్ని కారణాల వల్ల గూగుల్ ప్లే స్టోర్ లో ఆ యాప్ లోడ్ అయిందని, దానిని తొలగించామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.