: చల్లబడ్డ వాతావరణం... నిజామాబాద్ లో చిరు జల్లులు... కరీంనగర్ లో అకాల వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వాతావరణం కాస్త చల్లబడింది. పలుచోట్ల చిరు జల్లులతో పాటు ఈదురు గాలులు వీచాయి. జుక్కల్ మండలం కతల్వాడిలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కాగా, కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. మానకొండూరు, రామగుండంలో వడగళ్ల వాన కురిసింది. ఎలిగేడు మండలంలోని ముప్పిడితోటలో గోడ కూలడంతో ఒక బాలిక మృతి చెందింది. కాగా, గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్న సంగతి విదితమే!