: ప్రత్యూష పిలుస్తోంది...నేను కూడా వెళతా: ప్రియుడు రాహుల్ పలవరింతలు


'బాలికావధు' సీరియల్ తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యతో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ షాక్ కు గురయ్యాడని అతని తండ్రి తెలిపారు. తన కుమారుడి ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడు చిత్రంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన చెప్పారు. ప్రత్యూష తనను పిలుస్తోందని, తాను కూడా వెళ్తానని అంటూ పలవరిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. దీంతో తన కొడుకు ఏమైపోతాడోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుమారుడు కోలుకోవాలని ప్రార్థించాలని ఆయన కోరారు. ప్రత్యూష ఆత్మహత్యకు రాహుల్ కారణమని వస్తున్న ఆరోపణలను అతడి బంధువులు తోసిపుచ్చారు.

  • Loading...

More Telugu News