: రవీంద్ర జడేజాకు 'అత్తింటి' కానుక... కోటి విలువైన ఆడి కారు గిఫ్ట్


టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అత్తింటి వారు బంపర్ బహుమతి ఇచ్చారు. రాజ్ కోట్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె రివబా సోలంకితో జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ఇలా వరుస షెడ్యూల్ తో బిజీగా ఉండడంతో వివాహం ఈ నెల 17న చేసుకోవాలని నిర్ణయించారు. టీ20 టోర్నీ ముగిసి ఇంటికి చేరిన అల్లుడికి అత్తింటి వారు కోటి రూపాయల విలువైన ఆడి కారును బహుమతిగా అందజేశారు. కాగా, జడేజా వివాహ వేడుకలు మూడు రోజులపాటు ఉంటాయి. రాజ్ కోట్ లోని ఓ హోటల్ లో సహచరులు, స్నేహితులు, సన్నిహితులకు ఈ నెల 16న బ్యాచులర్ పార్టీ ఇవ్వనున్నాడు. 17న అదే హోటల్ లో వివాహం, రిసెప్షన్ ఉంటాయి. 18వ తేదీన స్వగ్రామం హడాతోడాకు చేరుకుంటారు. అక్కడ గ్రామస్థులతో వేడుకలు ఉంటాయి. ఇలా మూడు రోజులు వివాహం ఉంటుంది.

  • Loading...

More Telugu News