: 'పనామా పేపర్స్'లో త్వరలో చంద్రబాబు పేరు: వైకాపా


విదేశాల్లో నగదు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేస్తున్న 'పనామా పేపర్స్'లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు త్వరలో వస్తుందని వైకాపా జోస్యం చెప్పింది. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, బాబు విదేశాల్లో ఆస్తులను దాచాడన్నది అందరికీ తెలిసిన సత్యమని, నల్లధనం దాచుకున్న వారిపై కేంద్రం విచారణ జరిపితే, ఆయన పేరూ బయటకు వస్తుందని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలోనే చంద్రబాబు అవినీతిని తెహల్కా బయట పెట్టిందని గుర్తు చేసిన ఆమె, ఆయన పాపాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులపై బాబు అభిప్రాయాన్ని చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News