: 'సౌదీ రాజు కాళ్లు మొక్కిన మోదీ' అంటూ మార్ఫింగ్ ఫోటో పెట్టిన సీఎన్ఎన్-ఐబీఎన్ జర్నలిస్టుపై కేసు


ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనలో ఉన్న వేళ, ఆ దేశపు రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిద్ అల్ సౌద్ కాళ్లు మొక్కారని చూపుతూ, ఓ సంచలన ఫోటోను పోస్టు చేసిన సీఎన్ఎన్-ఐబీఎన్ జర్నలిస్టు రాఘవ్ చోప్రాపై కేసు నమోదైంది. గతంలో ఎన్నడో అద్వానీ కాళ్లకు నమస్కరిస్తున్న చిత్రాన్ని తీసుకుని, దాన్ని మార్ఫింగ్ చేసి ఈ ఫోటోను తయారు చేశారని తెలుసుకున్న బీజేపీ టెక్నాలజీ సెల్ ఇన్ చార్జ్ అరవింద్ గుప్తా, ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రాఘవ్ పెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, భారత్ పరువు తీశారని ప్రధాని మోదీపై విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక విషయం తెలుసుకున్న తరువాత, సదరు జర్నలిస్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం మొదలైంది. దీనిపై స్పందించిన రాఘవ్ చోప్రా, ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా పోస్టు చేసి పెద్ద పొరపాటు చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని, అసలు చిత్రాన్నీ ఇక్కడ చూడవచ్చు.

  • Loading...

More Telugu News