: నల్లధనంపై నివేదికకు ఈ 25 డెడ్ లైన్: 'సుప్రీం' సిట్
విదేశాల్లో అక్రమంగా నగదును దాచుకున్న వారి వివరాలను 'పనామా పేపర్స్' దశలవారీగా విడుదల చేస్తున్న వేళ, ఈ జాబితాలోని భారతీయుల పేర్లపై, వీరు దాచుకున్న డబ్బుపై విచారించి ఈ 25లోగా నివేదిక ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీడీటీ తదితర విభాగాలకు తాఖీదులు అందాయి. ఈ మేరకు నల్లధనంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 25వ తేదీ నాటికి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ అరిజిత్ పస్యత్ ల నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఆదేశించింది. కాగా, పనామా పేపర్స్ విడుదల చేసిన జాబితాలోని వివరాలపై మొదట వాస్తవాన్ని శోధించాలని, ఆపై కేసులు పెట్టాలని ఈడీ తదితర సంస్థలు భావిస్తున్నాయి.