: వడగాలుల హెచ్చరిక... తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలన్న అధికారులు
వచ్చే 48 గంటల్లో ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింతగా పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. కాగా, నిన్న ఒక్కరోజులోనే రెండు రాష్ట్రాల్లో 25 మంది వడదెబ్బకు గురై మరణించారు. అనంతపురంలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్, రామగుండం, కర్నూలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య భానుడి తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.