: ఏపీలో ‘పుర’ పోరు!... త్వరలో ఆరు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు


కొత్త రాష్ట్రం తెలంగాణలో పురపాలక సంస్థలకు ఎన్నికలు దాదాపుగా ముగిశాయి. సీఎం కేసీఆర్ సొంతూరు సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. ఈ ఎన్నికతో తెలంగాణలో ‘పుర’పోరు ముగిసినట్లే. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలోని ఆరు నగరపాలక సంస్థలు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ‘పుర’ పోరుకు దాదాపుగా గ్రీస్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మునిసిపాటీల అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయింది. విశాఖపట్నం, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, కాకినాడ, తిరుపతి కార్పొరేషన్లతో పాటు రాజంపేట, నెల్లిమర్ల, శ్రీకాకుళం, రాజాం, కందుకూరు మునిసిపాలిటీలకు జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.

  • Loading...

More Telugu News