: ‘అనంత’లో హైటెన్షన్!... వైసీపీ ఎమ్మెల్యేపై దాడి చేసిన ప్రత్యర్థులు


అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి వైసీపీ నేత, కదిరి ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషాపై దాడి జరిగింది. జిల్లాలోని తలపులలో సహామీరియా ఉర్సులో పాల్గొనేందుకు వెళ్లిన చాంద్ బాషాపై ఆయన ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం కాగా, చాంద్ బాషాకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ దాడితో ఆయన షాక్ కు గురయ్యారు. తనపై జరిగిన దాడి రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. దాడిపై వేగంగా స్పందించిన చాంద్ బాషా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన... నిందితులపై చర్యల్లో జాప్యం జరిగితే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్న వార్తతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News