: నాగార్జున భేష్...సినిమా బాగుంది: దాసరి కితాబు
చాలా కాలం తరువాత తాను ఆస్వాదిస్తూ వీక్షించిన సినిమా 'ఊపిరి' అని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. 'ఊపిరి' సినిమా చూసిన సందర్భంగా ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రశంసలు కురిపించారు. 'బొమ్మరిల్లు' తరువాత తాను ఇష్టపడిన సినిమా, ఆస్వాదించిన సినిమా 'ఊపిరి' అని ఆయన చెప్పారు. నటుడన్న వాడు పాటలు, ఫైట్లతోనే కాకుండా కేవలం కళ్లతోనూ నటించగలడని నాగార్జున నిరూపించాడని ఆయన కితాబునిచ్చారు. అలా నటించడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్తీ చాలా చక్కగా నటించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో దిగిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.