: అన్ని పార్టీలు ఆఫరిచ్చాయి...ప్రస్తుతం రాజకీయాలొద్దు: రవీనా టాండన్


తనకు అన్ని పార్టీలు లోక్ సభ, రాజ్యసభ టికెట్లిస్తామని ఆఫర్ ఇచ్చాయని ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలిపింది. తాజా చిత్రం షూటింగ్ లో భాగంగా గుర్గావ్ వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పింది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడం తనకు అలవాటని ఆమె చెప్పింది. రెండు పడవలపై కాలు పెట్టడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపింది. ప్రస్తుతానికి స్వేచ్ఛగా తన గళం విప్పుతానని ఆమె పేర్కొంది. ట్విట్టర్లో వ్యక్తం చేసే అభిప్రాయాలపై రాదాంతం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడింది. ఈ సినిమా ద్వారా ఓ సందేశం ఇవ్వనున్నామని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News