: సరితా నాయర్ కు నోటీసులు పంపిన ఉమెన్ చాందీ
సోలార్ ప్యానెళ్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాలీవుడ్ సినీ నటి సరితా నాయర్ కు లీగల్ నోటీసులు పంపినట్టు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలిపారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, సరిత మూడేళ్ల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటపడడంలో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీని వెనుక బలమైన లాబీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోలార్ ప్యానెట్ స్కాం వెలుగు చూసి మూడేళ్లు కాగా, ఇది ఇప్పుడే జరిగినట్టు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుతో ఇబ్బందులు పడుతున్నవారే తమపై బురదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు.