: యూనివర్సిటీల ర్యాంకులపై కన్నయ్య కుమార్ విమర్శలు
కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన యూనివర్సీటీల ర్యాంకులు హాస్యాస్పదంగా ఉన్నాయని జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు జేఎన్యూ స్వయం ప్రతిపత్తిపై విమర్శలకు దిగుతూనే, జేఎన్యూను దేశంలోని ఉత్తమ యూనివర్సిటీల్లో మూడవ ర్యాంకులో పెట్టడం హాస్యాస్పదమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 3500 యూనివర్సిటీలను పరిశీలించిన మానవ వనరుల శాఖ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ముంబైలోని ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మూడవ స్థానంలో జేఎన్యూ, నాలుగవ స్థానంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. దీంతో కన్నయ్య ఈ తాజా విమర్శలు చేశారు. గతంలో బీజేపీకి చెందిన పలువురు నేతలు జేఎన్యూ, హెచ్సీయూలు తీవ్రవాద కార్యాలయాలుగా మారాయంటూ పలు ఆరోపణలు సంధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.