: కేటీఆర్ కృషి అభినందనీయం: గవర్నర్ నరసింహన్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఐటీని తీసుకెళ్లడంలో కేటీఆర్ కృషి ప్రశంసనీయమన్నారు. టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని నరసింహన్ ఆకాంక్షించారు.