: 'డొనాల్డ్ ట్రంప్' పేరుతో హెరాయిన్ విక్రయం
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముందున్న రిపబ్లికన్ పార్టీ నేత 'డొనాల్డ్ ట్రంప్' పేరును హెరాయిన్ ప్యాకెట్లకు పెట్టి అమ్ముతోన్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూహాంప్షైర్లో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. డార్సీ హాల్ అనే మహిళ చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఓ డిటెక్టివ్ మెక్‌డొనాల్డ్స్ వద్ద ఒక ప్యాకెట్ ను, మినీ మార్ట్ వద్ద మరో ప్యాకెట్ హెరాయిన్‌ను ఆమె వద్ద నుంచి కొనుగోలు చేశాడు. దీంతో ఈ ప్యాకెట్లు 'డొనాల్డ్ ట్రంప్' బ్రాండ్‌నేమ్‌తో ఉన్నాయని పోలీసులకి తెలిసింది. ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డార్సీ కారు, ఇంటిని సోదా చేసినపుడు, తగిన సాక్ష్యాధారాలు లభించాయని పేర్కొన్నారు.