: కోల్ స్కామ్ లో తొలి తీర్పు... దోషులకు నాలుగేళ్ల జైలుశిక్ష


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తొలి తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా తేలిన జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలు జాతి ప్రయోజనాలకు దెబ్బకొడుతూ, ప్రభుత్వాలను మోసం చేశారని తేలినందున వీరికి నాలుగేళ్ల జైలుశిక్షను, దీనికి అదనంగా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల జరిమానాను విధిస్తున్నట్టు న్యాయమూర్తి భరత్ పరాశర్ తీర్పిచ్చారు. ఆపై జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ఇద్దరినీ గత వారంలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సహా పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, పదుల సంఖ్యలో కేసులు విచారణ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News