: ముంబైలో బాలలతో కలిసి క్రికెట్ ఆడ‌నున్న బ్రిట‌న్ యువ‌రాజు.. పాల్గొన‌నున్న స‌చిన్


బ్రిట‌న్ యువ‌రాజు ముంబైలో బాల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన‌నున్నారు. బ్రిటన్ యువరాజు విలియమ్స్, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్ భార‌త్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 10 నుంచి దేశంలో పర్యటించబోతున్న వీరి కోసం ముంబై సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తాజ్ మహల్ ప్యాలెస్‌లో వీరిద్దరూ బస చేస్తారు. దిలీప్ వెంగ్‌సర్కార్ క్రికెట్ మైదానంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని బాలలతో కలిసి బ్రిటన్ యువరాజు క్రికెట్ ఆడతారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం దక్షిణ ముంబైలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తాజ్ క్రిస్టల్ రూమ్‌లో క్రీడలు, వ్యాపార, బాలీవుడ్ దిగ్గజాలతో విలియమ్స్, కేట్ పరిచయ కార్యక్రమం, విందు జరుగుతాయి.

  • Loading...

More Telugu News