: ఆసుపత్రిలో ప్రత్యూష ప్రియుడు.. బ్రెయిన్ హెమరేజ్‌కు దారితీసే ప్రమాదం
డబ్బింగ్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకూ చిరపరిచితురాలైన ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేమే కారణమని భావిస్తున్నారు. అయితే, ఆమె ప్రియుడు రాహుల్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. రాహుల్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో రాహుల్ చికిత్స పొందుతున్నాడు. ప్రత్యూష చనిపోవడంతో రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని రాహుల్ తరపు లాయర్ తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్రెయిన్ హెమరేజ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.