: వైట్‌హౌస్‌లో డిన్నర్‌కు ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ఎంటరై సంచలనాలు నమోదు చేస్తున్న మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వైట్‌హౌస్‌లో డిన్నర్‌కి ఆహ్వానం అందుకుంది. ఈ నెలాఖరున అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్ ఒబామాలతో కలిసి విందులో పాల్గొనేందుకు ప్రియాంకకి ఆహ్వానం అందింది. ప్రియాంకతో పాటు హాలీవుడ్ ప్రముఖులు బ్రాడ్లీ కూపర్, లూసీ లియూ, జేన్ ఫోండా, గ్లాడిస్ నైట్లు కూడా ఆహ్వానం అందుకున్నారు. కాగా, హాలీవుడ్ స్టార్ డ్వెయిన్ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్’ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నటిగా మారిపోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ టీవీ సీరియల్ ‘క్వాంటికో’ షూటింగ్‌లోనూ బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రియాంక విందుకు వెళ్తున్నదీ లేనిదీ ఇంకా వెల్లడించలేదు.