: వీసీ అప్పారావును రీకాల్ చేయాలంటూ వామపక్షాల ఛలో రాజ్‌భవన్.. ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు రెండు నెలల సెలవుల తరువాత తిరిగి విధుల్లోకి చేరిన నేపథ్యంలో వీసీని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టాయి. ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సీపీఐ నేత నారాయణ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేయాలనే డిమాండ్ తో ఇటీవలే విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.