: రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా రానున్న బజాజ్ బైక్!


మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ విభాగంలో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ కు బజాజ్ ఆటో పోటీకానుంది. 350 నుంచి 600 సీసీ సెగ్మెంట్ లో తాము కొత్త బైక్ లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇండియాలో మూడవ అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థగా ఉన్న బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. ఈ సెగ్మెంట్ లో ఒకే సంస్థ రాజ్యమేలుతోందని, మరో కంపెనీ ప్రవేశానికి మంచి అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు 2014-15తో పోలిస్తే 52 శాతం పెరిగి 6 లక్షల యూనిట్లకు చేరాయి. హీరో మోటో, టీవీఎస్, బజాజ్, హోండా తదితర సంస్థలు అమ్మకాలు పెంచుకోవడంలో విఫలమవుతున్న వేళ, ఎన్ ఫీల్డ్ విక్రయాలు గణనీయంగా పెరగడంతో, కస్టమర్ల ఆలోచనా ధోరణి సైతం మారుతోందని, లగ్జరీ బైకుల పట్ల ఆసక్తి పెరుగుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News