: అంతా పచ్చి అబద్ధం: 'పనామా పేపర్స్'పై నిప్పులు చెరిగిన ఐశ్వర్యా రాయ్


విదేశాల్లో డబ్బు దాచుకున్న వారి జాబితాలో తన పేరు రావడంపై బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మండి పడింది. బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని, పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు ఐశ్వర్య మీడియా సలహాదారు నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా, ఈ జాబితాలో ఇండియాకు చెందిన 500 మంది పేర్లుండగా, వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. 140 మందికి పైగా రాజకీయ నాయకులు, 200 మంది వరకూ వ్యాపారవేత్తలు, 12 మంది రాష్ట్రాధినేతలు, సెలబ్రిటీల పేర్లను పనామా పేపర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News