: కేర‌ళ ఫాదర్ ఉజున్నలిల్‌ను ఉగ్ర‌వాదులు శిలువ వేయ‌లేదు.. ఆయ‌న క్షేమం: సుష్మాస్వ‌రాజ్


ఈ నెల 4న యెమెన్‌లో ఉగ్రవాదులు అపహరించి, ఆపై శిలువ వేసి చంపేసిన‌ట్లు భావిస్తున్న కేరళకు చెందిన ఫాదర్ ఉజున్నలిల్ క్షేమంగా ఉన్నారు. ఆయనను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనను కలిసిన కాథ‌లిక్ బిషాప్స్ కాన్ఫ‌రెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ప్రతినిధులకు చెప్పారు. అయితే, గుడ్‌ ఫ్రైడే రోజున‌ ఇస్లామిక్‌ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఫాదర్ ఉజున్నలిల్‌ను హ‌త‌మార్చారని, అమెరికా మీడియా ప్ర‌చురించింది. మదర్‌ థెరెస్సా మిషనరీలో పని చేస్తున్న కాథలిక్‌ మతానికి చెందిన ఫాదర్ ఉజున్నలిల్ ను కొంతమంది దుండగులు అపహరించుకుపోయి, శిలువ వేసి చంపేసిన‌ట్లు కొద్ది రోజుల క్రితం అమెరికా మీడియా తెలిపింది. యెమెన్‌లో మదర్ థెరిస్సా చారిటీ మిషనరీలు నిర్వహిస్తున్న కేర్ హోమ్‌పై గత నెలలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు దాడి చేసిన నాటి నుంచి ఫాదర్ ఉజున్నలిల్ కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన ఫాదర్‌ టామ్‌ ఉజున్నలిల్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన‌ట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ధ్రువీకరించారు. తాజాగా ఆయ‌న క్షేమంగానే ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న‌ను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు, పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News