: 41 స్థానాల వద్ద బేరం ఫైనల్ చేసిన కరుణానిధి!
తమిళనాట కాంగ్రెస్, డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. 41 సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు కరుణానిధి అంగీకరించారు. ఈ ఉదయం ఆయన ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, 45 సీట్లను కోరినప్పటికీ, అప్పటికే 40 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమై ఉన్న డీఎంకే అధినేత, ఆపై ఒక్క సీటును కూడా ఇవ్వబోమని కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. దీంతో గులాం నబీ సైతం ఓ మెట్టు దిగగా, స్టాలిన్, కనిమొళిలు కొద్దిసేపు తండ్రితో చర్చించి, 41 సీట్ల వద్ద బేరాన్ని ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.