: చెన్నైలో ల్యాండైన ఆజాద్... ‘పొత్తు’ కోసం కరుణతో భేటీ


తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘పొత్తు’లపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేల పొత్తుల యత్నాలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ రెండు పార్టీలతో పొత్తుల కోసం అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చేయని యత్నం లేదు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం కేంద్ర మంత్రులు చెన్నై చుట్టూ చక్కర్లు కొడుతుంటే, డీఎంకేతో పొత్తు కోసం కాంగ్రెస్ కుస్తీలు పడుతోంది. ఇప్పటికే ఓ దఫా చెన్నై వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్... తాజాగా కొద్దిసేపటి క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. విమానం దిగీ దిగగానే ఆయన నేరుగా డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లారు. ఆ వెంటనే ఇద్దరు నేతలు చర్చల్లో మునిగిపోయారు. ఈ భేటీపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News