: పెళ్లయితే మన జోలికి ఎవరూ రారుగా, అందుకే చిన్న వయసులోనే చేసేసుకున్నా!: సినీ నటి అన్నపూర్ణ


‘ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు ప్రేమిస్తారు.. అందుకని చెప్పి, చిన్న వయస్సులోనే పెళ్లి చేసేసుకున్నా. పెళ్లయిన వాళ్ల జోలికెవ్వరూ రారు కదా?’ అని ప్రముఖ సినీనటి అన్నపూర్ణ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'ముఖానికి రంగు ఉండాలి, చుట్టూ జనం కనపడుతుండాలి.. దాని తర్వాతే ఏదైనా అని అనుకునే దానిని' అంటూ తన ఙ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. నాటకాల నుంచి సినిమా రంగం వైపు తాను వచ్చానని... ప్రముఖ నటులు రాజబాబు, మురళీమోహన్, దర్శకుడు జంధ్యాల వంటి వారితో కలిసి నాటకాలు వేశానని చెప్పారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో తన ప్రయాణం ఆ దిశగా మొదలైందంటూ నాటి విషయాలను అన్నపూర్ణ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News