: నన్ను టీడీపీలోకి రమ్మంటున్నారు: రోజా
తనను టీడీపీలోకి రమ్మంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 'వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఎవరినైనా తీసుకుంటాను గానీ, రోజాను మాత్రం తీసుకోను' అని సీఎం చంద్రబాబు గతంలో అన్న విషయం ప్రస్తావిస్తే ఆమె పైవిధంగా స్పందించారు. తనను ఆ పార్టీలోకి రమ్మనమని ఎన్ని బలవంతాలు వస్తున్నాయో తనకు మాత్రమే తెలుసని అన్నారు. తానేదో మట్టిముద్దగా ఉంటే తననేదో ఒక బొమ్మను చేసి, లైమ్ లైట్ లోకి చంద్రబాబు తీసుకువచ్చారంటే తాను ఒప్పుకోనని ఒక ప్రశ్నకు సమాధానంగా రోజా చెప్పారు. అప్పట్లో తనను టీడీపీలోకి రమ్మని చంద్రబాబు పిలవడం, దానికి తాను ఓకే చెప్పడం జరిగిందని, తన గ్లామర్, తన కష్టం పార్టీకి ఉపయోగపడ్డాయి కానీ, పార్టీ వల్ల తనకేమీ ఉపయోగం జరగలేదని రోజా అన్నారు.