: అధికార పక్ష సభ్యులు చేసే వ్యాఖ్యలకు చచ్చిపోవాలనిపిస్తుంది: ఎమ్మెల్యే రోజా
అసెంబ్లీలోను, మీడియా పాయింట్ వద్ద అధికార పక్ష సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు తనను చాలా బాధిస్తున్నాయని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. టీడీపీ నేతలు పీతల సుజాత, అనిత చేస్తున్న వ్యాఖ్యలకు చచ్చిపోవాలన్నంత బాధ కలుగుతోందన్నారు. తన తల్లిదండ్రులతో బాటు, తన భర్త కూడా ఎంతో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారని, తాను ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్ నని.. తామందరం తలెత్తుకుని గౌరవంగా తిరిగే వాళ్లమని, ఇప్పుడు వీళ్లు చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలతో తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.