: 10న విశాఖలో 'సరైనోడు' ఆడియో సెలబ్రేషన్స్


ఈ నెల 10వ తేదీన విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో 'సరైనోడు' ఆడియో సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ముగ్గురు హీరోయిన్లు హాజరుకానున్నట్లు అల్లు అరవింద్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించడానికి ఒక కారణం ఉందని, ఫిల్మ్ ఇండస్ట్రీని వైజాగ్ కు తీసుకురావాలన్న నిశ్చయంతో మంత్రి గంటా హైదరాబాద్ లో రెండు, మూడు సార్లు మీటింగ్ లు పెట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘సరైనోడు’ సెలబ్రేషన్స్ ను అక్కడ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏపీలో నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ ఇదే కాబోతోందని అన్నారు. విశాఖపట్టణం వేదికగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అక్కడ స్టూడియోలు నెలకొల్పడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారని అన్నారు. చిత్ర పరిశ్రమ విశాఖకు తరలిరావాలని ఆశిస్తున్నామని గంటా పేర్కొన్నారు. కాగా, 'సరైనోడు' చిత్రం పాటలను ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా మార్కెట్లోకి ఈ నెల 1వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News