: మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు
మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ లో వెస్టిండీస్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని సాధించింది. కాగా, వెస్టిండీస్ ఓపెనర్లు మాథ్యూస్ (66), టేలర్ (45) చెలరేగి ఆడారు. డీజేఎస్ డాటిన్(18), బి కూపర్(3) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మహిళల టీ20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన విండీస్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్కోర్లు: ఆస్ట్రేలియా 148/5, వెస్టిండీస్ 149/2