: తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోవడం ఖాయమని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సభ్యులందరికీ సమాన అవకాశమివ్వాలని, తమకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవకాశమివ్వాలని స్పీకర్ కు లేఖ రాసినా ఆయన స్పందించలేదని అన్నారు. పెండింగ్ లోని 22 ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కాగ్ తేల్చి చెప్పిందన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని రేవంత్ రెడ్డి సూచించారు.