: వార్తలు ప్రచురించేటప్పుడు కొంచెం ఆలోచించండి: పాక్ ప్రభుత్వం


వార్తలు ప్రచురించేటప్పుడు కొంచెం ముందూవెనుక చూసుకోవాలని పాక్ మీడియాను అక్కడి సర్కార్ హెచ్చరించింది. పాక్ ప్రభుత్వం ఈ ప్రకటనలు చేయడానికి కారణం..ఇరాన్ తో కలిసి గూఢచర్యం నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో భారత్ కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్టు చేశారని పాక్ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఇటువంటి వార్తలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్ స్పందిస్తూ, ఇరాన్ కు- భారత్ ఇంటెలిజెన్స్ అధికారికి సంబంధం లేదని, ఇటువంటి వార్తలు ప్రచురించేటప్పుడు కొంచెం ఆలోచించాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఇరాన్, పాక్ ల మధ్య సత్సంబంధాలున్నాయని, అవి చెడిపోయేలా వార్తలు రాయవద్దని, ఇంకోసారి ఈవిధంగా జరిగితే మీడియాపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News