: విజయవాడలో ఘరానా మోసం... చదువుకున్న అమ్మాయిలే లక్ష్యంగా రాజ్ గ్రూప్ లక్షల్లో వసూలు
విజయవాడలో మరో కంపెనీ బండారం బట్టబయలైంది. చదువుకున్న అమ్మాయిలే లక్ష్యంగా, వారికి ఉన్నత ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆశలు చూపి లక్షల రూపాయల డబ్బు వసూలు చేసిన రాజ్ గ్రూప్ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యువతులే టార్గెట్ గా ఫ్రీలాన్స్, హెచ్ఆర్ ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఎంతో మంది నుంచి డబ్బు వసూలు చేసిన సంస్థ, 'నేడు, రేపు' అంటూ నిరుద్యోగులను తిప్పించుకొంటుండటంతో, అందరూ కలిసి పోలీసుస్టేషన్ ను ఆశ్రయించారు. తమకు క్యాంపస్ రిక్రూట్ మెంట్ల పేరు చెప్పి కుచ్చుటోపీ పెట్టారని, ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి, ఆపై కనిపించడం మానేశారని, డబ్బు వసూలు చేసుకుని ఉద్యోగాలు ఇవ్వలేదని, రాజ్ గ్రూప్ పై పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.