: టీసీఎస్ ఉద్యోగులతో మోదీ ప్రత్యేక భేటీ


సౌదీ అరేబియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు పర్యటన బిజీగా సాగుతోంది. ఈ ఉదయం రియాద్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ, కాసేపు వారి సాదక బాధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిష్ణాతులైన ఐటీ ఉద్యోగులు భారత ఐటీ రంగం కీర్తి ప్రతిష్ఠలను విదేశాల్లో ఇనుమడింపజేస్తున్నారని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, ఈ మధ్యాహ్నం మోదీ, సౌదీ రాజు మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు భాగస్వామ్య ఒప్పందాలను ఇరు దేశాలూ కుదుర్చుకోనున్నాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News