: న్యూఢిల్లీ నెహ్రూ స్టేడియంలో 'చిట్టి'...రోబో సీక్వెల్ అప్ డేట్!


చిట్టి... ఈ పేరు గుర్తుందిగా? రజనీకాంత్ నటించిన రోబో చిత్రంలో వశీకర్ తయారు చేసిన రోబో పేరు. ఇప్పుడు రోబో సీక్వెల్ గా '2.0' పేరిట రూపొందుతున్న చిత్రం షూటింగ్ న్యూఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో మండే ఎండల మధ్య జరుగుతుండగా, రజనీ కుమార్తె ఐశ్వర్య, షూటింగ్ జరుగుతున్న ప్రాంతం వద్ద దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రోబో చిట్టి పాత్రలో రజనీ నటిస్తున్న దృశ్యాలను ఇక్కడ చిత్రీకరిస్తుండగా 'చిట్టీ ఈజ్ బ్యాక్' అంటూ ఐశ్వర్య పోస్ట్ చేసిన ఫోటో ఇది.

  • Loading...

More Telugu News