: రంగా విగ్రహం ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర: మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నిజాంపేట వద్ద దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహ ధ్వంసం ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కాపులను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారని వెల్లడించిన ఆయన, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఘటనలో ధ్వంసమైన విగ్రహం స్థానంలోనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వెల్లడించిన ఆయన, కాపు వర్గం సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, ఎక్కడా విధ్వంసాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.