: తెలుగులో రూ. కోటితో తీసిన సినిమా... హిందీలో సల్మాన్ తో రూ. 80 కోట్లతో రీమేక్!


ఓ చిన్న సినిమాగా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'క్షణం' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. తెలుగులో కోటి రూపాయల బడ్జెట్ తో తీసిన చిత్రంలో అడవి శేష్, సొంతంగా కథ రాసుకుని అందులో తానే హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పీవీపీ సంస్థ కథపై నమ్మకంతో పెట్టుబడి పెట్టిన చిత్రం హిందీ రీమేక్ హక్కులను సాజిద్ నడియావాలా కొనగా, అందులో నటించేందుకు సల్మాన్ ఖాన్ అంగీకరించాడట. దీంతో హిందీలో ఈ సినిమాను రూ. 80 కోట్లతో నిర్మించడానికి ప్రణాళిక తయారైనట్టు తెలుస్తోంది. సల్మాన్ హీరోగా, నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటించేందుకు అంగీకరించడంతో, ఇతర పాత్రల కోసం సాజిద్ ఆడిషన్స్ మొదలు పెట్టినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News