: వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం... కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
మచిలీపట్నంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఈ ఉదయం కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, పలు ప్రాంతాల్లో కాపు సంఘాల నేతలు ధర్నాలకు దిగారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పరిశీలించిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను చూస్తున్నామని వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో కాపు యువత రోడ్లను దిగ్బంధించారు.