: 'వధువు' అలంకరణలో ప్రత్యూష ఆఖరి ప్రయాణం... అంత్యక్రియలు పూర్తి!


'ఆనంది'గా బుల్లితెర ద్వారా భారతీయుల ఇళ్లలో ప్రవేశించి, ఏళ్ల తరబడి అలరించి, అర్థాంతరంగా తనువు చాలించిన ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియలు బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. నిండైన వస్త్రధారణతో, పెద్ద బొట్టుతో రోజూ కనిపించే ప్రత్యూష, విగతజీవిగా కంటిముందుండగా, విలపించని వారు లేరు. ఆమె మృతదేహాన్ని కొత్త పెళ్లికూతురుగా అలంకరించారు. పట్టుచీర కట్టి, అదే అలంకరణ మధ్య అమె తుది ప్రయాణం ప్రారంభం కాగా, వందలాది మంది అభిమానులు వెన్నంటి నడిచారు. ముంబైలోని ఓషివారా క్రిమెటోరియంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News