: 'వరుడు కావలెను' అంటూ హోర్డింగ్ పెట్టిన థాయ్ సినీ నటి
40 ఏళ్ల సినీ నటి వరుడి కోసం ఇచ్చిన ప్రకటన థాయ్ లాండ్ లో కలకలం రేపింది. బ్యాంకాక్ లోని ప్రధాన కూడలిలో ఓ హోర్డింగ్ వెలసింది. అందులో కేవలం అండర్ వేర్ మాత్రమే ధరించి ఉన్న సినీ నటి అరణ్య పుయ్ తనకు వరుడు కావాలని పేర్కొంది. తన వయసు 40 ఏళ్లని, తానింకా కన్యనేనని పేర్కొంది. మరణించేలోపు వైవాహిక జీవితంలోని ఆనందం చవిచూడాలనిపిస్తోందని ఆమె పేర్కొంది. 'వాంట్ యూ' పేరిట వెలసిన ఈ హోర్డింగ్ లో ఆమె తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం విశేషం. 45 ఏళ్ల వయసున్న వరుడి కోసం అరణ్య పుయ్ మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ యాప్స్ లో తీవ్రప్రయత్నాలు చేసింది. అయినా సరైన వరుడు దొరకకపోవడంతో చివరి ప్రయత్నంగా ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసింది. అరణ్య పుయ్ ధాయ్ లాండ్ లోని బీగ్రేడ్ సినిమాల్లో నటిస్తోంది.