: నిక్కీ గల్రానీకి బ్రాస్ లెట్ ఇచ్చిన పి.సుశీల


టాలీవుడ్ వర్ధమాన నటి నిక్కీ గల్రానీకి ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల బ్రాస్ లెట్ ఇచ్చారు. గానకోకిల పి.సుశీల తనకు బ్రాస్ లెట్ ఇచ్చారని చెబుతూ, ఆమె ఇచ్చిన బ్రాసెలెట్, ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఫేస్ బుక్ ఖాతాలో పెట్టింది. బ్రాస్ లెట్ ఇచ్చిన సుశీలమ్మకు ధన్యవాదాలు చెప్పింది. ఆమె పెట్టిన ఫోటోలను బట్టి విమానంలో వెళ్తుండగా వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సుశీల ఆమెకు బహుమతి ఇచ్చారు. కాగా, వారు తీసుకున్న సెల్ఫీలో పలువురు ప్రయాణికులు కూడా ఉండడం విశేషం. కాగా, నిక్కీ గల్రానీ 'బుజ్జిగాడు' ఫేం సంజన సోదరి. ఆమె నటించిన 'ఆడోరకం ఈడోరకం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

  • Loading...

More Telugu News