: శ్రీజ పెళ్లిలో పవన్ కల్యాణ్ భార్య!
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె వివాహానికి ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ కారణంగా హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వినిపించాయి. వీటన్నింటికీ సమాధానంగా పలు ఫోటోలు నేడు విడుదలయ్యాయి. కుటుంబ కార్యక్రమానికి పని ఒత్తిడి వల్ల ఆయన దూరంగా ఉన్నప్పటికీ, ఆయన సతీమణి ఈ వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోల్లో రష్యా వనిత అయిన అన్నా లెజ్ నోవా పూర్తి భారతీయ సంప్రదాయ పద్ధతిలో చీరకట్టుకుని కనువిందు చేశారు. కుటుంబ సభ్యులందరితో కలిసిపోయి వివాహాన్ని ఆనందించారు. దీంతో గతంలో పలు సందర్భాల్లో పవన్ కుటుంబం చెప్పినట్టు వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం పనుల ఒత్తిడేనని తేలిపోయింది. కాగా, తీన్ మార్ సినిమా సమయంలో అన్నా లెజ్ నోవాతో ప్రేమలో పడిన పవన్ కల్యాణ్, తరువాత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.