: తుపాకీతో కాలుస్తూ ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్... కలకలం రేపుతున్న వీడియో


అమెరికాలో తుపాకీ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. దీంతో అక్కడ విచ్చలవిడిగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి తుపాకితో మరొకరిని కాలుస్తుండగా ఆ దృశ్యాలను మరొకరు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇందులో ముందుగా, నీలి రంగు టోపీ ధరించిన ఓ వ్యక్తి ఓ స్టోర్ బయటకు వచ్చి మాట్లాడుతూ కనిపిస్తాడు. తరువాత కెమెరాను వీధివైపు తిప్పుతారు. అప్పుడు ఓ వ్యక్తి ఫ్రేమ్ లోకి వచ్చి తుపాకీతో కాల్పులు జరుపుతాడు. వెంటనే ఓ మహిళ ఆర్తనాదాలు వినపడతాయి. ఈ లైవ్ కాల్పుల వీడియో నిజమైనదేనని షికాగో పోలీసులు నిర్ధారించారు. ఈ వీడియో గురించి తమకు తెలుసని, నిందితుడి గురించి ఆరా తీస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News