: గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్నను చంపిన 15ఏళ్ల టీనేజర్
ప్రేమించిన అమ్మాయి కోసం ఓ 15ఏళ్ల టీనేజర్ తోడబుట్టిన అన్ననే చంపేసిన ఉదంతం యూఎస్ పెన్సిల్వేనియాలోని దుపిన్ కౌంటీలో చోటు చేసుకుంది. యూఎస్ పెన్సిల్వేనియాలో నివసిస్తోన్న డకొటా త్రాంటన్ (15), డొమినిక్ (18) సోదరులు ఒకే అమ్మాయిపై మనసు పారేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం సోదరులిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తన అన్న డొమినిక్ను డకొటా గన్నుతో కాల్చి కాల్చి చంపేశాడు. ఈ హత్య కేసులో డకొటాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన సోదరుడిని తానే హత్య చేసినట్లు డకొటా ఒప్పుకున్నాడు.