: మంగళగిరిలో ఏపీ టీడీపీ ఆఫీస్!... ఉగాది నుంచి పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచేనట!


రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేవలం టీ టీడీపీ కార్యకలాపాలకే పరిమితమైపోయింది. పార్టీ ఏపీ కార్యకలాపాలన్నీ విజయవాడకు షిఫ్ట్ అయిపోయాయి. దీంతో, ఏపీ టీడీపీ కార్యకలాపాల కోసం మంగళగిరి ప్రాంతంలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్నే రానున్న కాలంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంగా అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా కార్యవర్గం సదరు కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కమిటీకి అప్పగించింది. ఉగాది నుంచి పార్టీ రాష్ట్ర కార్యకలాపాలను ఆ కార్యాలయం నుంచే నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News