: టీమిండియా ఓటమి విషయంపై విద్యార్థులు మధ్య ఘర్షణ... తెరుచుకోని శ్రీనగర్ ఎన్‌ఐటీ
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో జమ్ముకాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో కొందరు కాశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీరీయేతర విద్యార్థులకు, కాశ్మీరీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు క్యాంపస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై వివాదం చెలరేగడంతో నిన్న కళాశాలను మూసేశారు. అయితే ఈరోజు కూడా కళాశాల తెరుచుకోలేదు. తిరిగి తరగతుల నిర్వహణ అంశం ఎప్పుడూ.. అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు నేడు అధికారులు సమావేశం కానున్నారు. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో చాలా మంది స్థానిక విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లారు.